బస్తర్ అడవుల్లో ఆయుధాల డంప్ స్వాధీనం
భద్రాచలం, వెలుగు: బస్తర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాల డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కాంకేర్–నారాయణ్‌పూర్ ప్రాంతాల మధ్య ఉన్న బస్తర్ అడవుల్లో శుక్రవారం కూంబింగ్ ఆపరేషన్ల సందర్భంగా ఈ డంప్ బయటపడింది. డంప్‌లో 50కి పైగా ఆయుధాలు, 10 మందుపాతరలు, 50 కిలోల గన్‌పౌడర్ లభించాయి.
వీటిలో ఎస్‌ఎల్‌ఆర్ ఒకటి, ఇన్సాస్ ఒకటి, 303 రైఫిల్స్ 5, సింగిల్‌షాట్ గన్స్ 11, బీజీఎల్ లాంచర్లు 8, బర్మార్ తుపాకులు 5, 12 బోర్ తుపాకులు 15, దేశీ నాటు తుపాకులు రెండు, 315 రైఫిల్, 7.65 పిస్తల్ ఉన్నాయి. 10 కుక్కర్ బాంబులు, నాలుగు వాకీటాకీలు, ఒక గ్యాస్ వెల్డింగ్ మిషన్, 34 బీజీఎల్ సెల్స్, 469 కాట్రిడ్జిలు కూడా స్వాధీనం చేసుకున్నారు. లొంగిపోయిన నక్సల్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బస్తర్ అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని నిఖిల్ రాఖేచా తెలిపారు.