Ravi Mohan: కెనీషాతో బ్రేకప్, ఆర్తితో డివోర్స్‌పై 'జయం' రవి సంచలన ప్రెస్‌మీట్... రెచ్చిపోతే తట్టుకోలేరంటూ
Jayam Ravi Latest News: 'జయం' రవిగా పాపులరైన రవి మోహన్... తన మాజీ భార్య ఆర్తికి వార్నింగ్ ఇవ్వడంతో పాటు విడాకులు వచ్చేవరకు సినిమాలు చేయనని స్పష్టం చేశారు. సింగర్ కెనీషా గురించీ స్పందించారు. 'జయం' రవిగా పాపులరైన హీరో రవి మోహన్ (Ravi Mohan). తన భార్య ఆర్తి (Aarti Ravi)తో నడుస్తున్న విడాకుల వివాదంతో పాటు తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై తీవ్రంగా స్పందించారు. ఆర్తికి వార్నింగ్ ఇవ్వడంతో పాటు విడాకులు వచ్చే వరకు సినిమాలు చేయనని స్పష్టం చేశారు. తన ప్రాణాలు పోవాలని కొందరు కోరుకుంటున్నారని చెప్పడంతో పాటు గాయని కెనీషా గురించి సంచలన వివరాలు వెల్లడించారు. నేను రెచ్చిపోతే తట్టుకోలేరు - రవి మోహన్ ఆర్తి రవికి విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రవి మోహన్... గాయని కెనీషా (Singer Kenisha)తో ప్రేమలో పడ్డారు. ఆవిడ చెన్నైకు షిఫ్ట్ అయ్యారు. అయితే రవి మోహన్ వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలతో చెన్నై వదిలి వెళ్లారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దాంతో రవి మోహన్ - కెనీషా మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం జరిగింది. తన జీవితం నుంచి కెనీషా వెళ్లడంతో రవి మోహన్ మీడియా ముందుకు వచ్చారు.
రవి మోహన్ మాట్లాడుతూ... "ఇన్నాళ్ళూ నేను మౌనంగా ఉన్నందుకు బాధ పడుతున్నా. సాధువులా ఉండటంతో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు'' అని భావోద్వేగానికి లోనయ్యారు. 'సాధు మిరిందాల్ కాడు కొల్లాదు' (సాధువు రెచ్చిపోతే అడవి కూడా తట్టుకోలేదు) - తమిళ సామెత చెబుతూ... ''నా మౌనాన్ని అసమర్థతగానో లేదంటే బలహీనతగానో భావించవద్దు'' అని ఆర్తికి వార్నింగ్ ఇచ్చారు. విడాకులు వచ్చే వరకు సినిమాల్లో నటించను విడాకులు లభించే వరకు సినిమాల్లో నటించబోనని, తన సినిమాలు అన్నీ తనకు విడాకులు లభించిన తర్వాత విడుదల అవుతాయని రవి మోహన్ స్పష్టం చేశారు. ఆయన ప్రకటన అభిమానులతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంకా రవి మోహన్ మాట్లాడుతూ... ''నాకు పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఒక్కటి కూడా లేదు. జాయింట్ అకౌంట్ ఉంది. అందులో నుంచి ఒక్క రూపాయి తీసినా సరే ఫోన్ వస్తుంది. ఎందుకు డ్రా చేశావని అడుగుతుంది'' అని చెప్పారు.