రూ.5వేల కోట్ల అదనపు సాయమివ్వండి
హైదరాబాద్, మే 20(నమస్తే తెలంగాణ) : అభివృద్ధి, సంక్షేమ పథకాల వేగాన్ని పెంచేందుకు ప్రత్యేక సహాయ పథకం(ఎస్‌ఏఎస్‌సీఐ) కింద తెలంగా ణకు అదనంగా రూ.5వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార కేం ద్రాన్ని కోరారు. రాష్ట్ర అభివృద్ధి, వి ద్యారంగంలో భారీ పెట్టుబడులు, మౌలి క వసతుల విస్తరణే లక్ష్యంగా బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన సమావేశ మ య్యారు. విద్యాప్రాజెక్టుల రుణాలను రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కోల్ గ్యాసిఫికేషన్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, సింగరేణి కూడా ఆ దిశగా ముందడుగు వేసేందుకు సిద్ధంగా ఉన్నదని భట్టి విక్రమార పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకత్వం, విధానపరమైన సహకారం, కేంద్ర పథకాల అనుసంధానంలో బొగ్గు మంత్రిత్వశాఖ సహకారం అందించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డిని ఆయన కోరారు.