Select Location
All Locations
State
Region
City / District
‘ఫోన్‌ డీయాక్టివేట్‌ వద్దు’

‘ఫోన్‌ డీయాక్టివేట్‌ వద్దు’

ముంబై, మే 20: బ్యాంక్‌ లోన్‌తో మొబైల్‌ ఫోన్‌ కొనుక్కుని, ఆ తర్వాత ఆ అప్పు చెల్లించకపోయినైట్టెతే సదరు రుణగ్రహీత ఫోన్లను బ్లాక్‌ లేదా డీయాక్టివేట్‌ చేయవద్దని బ్యాంకర్లకు ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే బాకీ వసూలు కోసం ఆ మొబైల్‌లోని ఫీచర్లను నిలుపుదల చేసి దాన్ని వాడుకోకుండా అడ్డుకోవచ్చునని బుధవారం తమ సవరించిన డ్రాఫ్ట్‌ మార్గదర్శకాల్లో పేర్కొన్నది.

ఇక వ్యక్తిగత, వాహన, గృహ రుణాల వసూలుకు వెళ్లే లోన్‌ రికవరీ ఏజెంట్లు, బ్యాంక్‌ ఉద్యోగులకూ స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. రుణగ్రహీత, లేదా గ్యారంటీర్ల వద్దకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్యలోనే వెళ్లాలన్నది. పరుష పదజాలం వాడరాదని.. కుటుం బ సభ్యులు, స్నేహితులు, బంధువులను అవమానించడం, దాడులు చేయడం కూడా నిషేధమేనని చెప్పింది.


V6 News 44 minutes ago
Home Flash News