Select Location
All Locations
State
Region
City / District
ఇరాన్‎తో చాలా మంచి డీల్‎కు దగ్గరయ్యాం: ట్రంప్

ఇరాన్‎తో చాలా మంచి డీల్‎కు దగ్గరయ్యాం: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాలు చాలా మంచి ఒప్పందానికి చేరువలో ఉన్నాయని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. తాము కోరుకున్నట్టుగా డీల్ కుదిరితే మంచిదని.. లేదంటే దానిని వేరే మార్గంలో ముగిస్తామని హెచ్చరించారు. శనివారం రాత్రి ఫాక్స్ న్యూస్‌‌ తరఫున తన కోడలు లారా ట్రంప్‌‌ చేసిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ‘మనం చాలా మంచి ఒప్పందానికి చేరువలో ఉన్నాం. మీరు తొందరపడితే మంచి ఒప్పందాన్ని చేసుకోలేరు.

ఒకవేళ మనం అనుకున్నది లభించకపోతే, దీనిని మరో మార్గంలో ముగిస్తాం. మనం పిలుచుకునే డిపార్ట్ మెంట్ ఆఫ్ వార్ ద్వారా రంగంలోకి దిగుతాం’ అని ట్రంప్ అన్నారు. తాము అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడం లేదని ఇరాన్ చెప్పిందని, అయితే వారు దానిని కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించానని ట్రంప్ చెప్పారు. దీంతో తాము సైనిక ఆయుధాన్ని అభివృద్ధి చేయబోమని లేదా ఏ రకంగానూ కొనుగోలు చేయబోమని చెప్తోందన్నారు. ఇరాన్ నేవీ, వాయుసేన పూర్తిగా నాశనమవ్వడంతో ఇరాన్‌‌పై అమెరికాకు గణనీయమైన పట్టు ఉందన్నారు.


V6 News 54 minutes ago
Home Flash News