Select Location
All Locations
State
Region
City / District
రాజకీయ ప్రవేశంపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన

రాజకీయ ప్రవేశంపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా గుర్తింపు పొందిన రాఘవ లారెన్స్ తన రాజకీయ ఎంట్రీపై సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను విడుదల చేస్తూ, ప్రజలు , అభిమానుల మద్దతు ఉంటేనే తాను రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని స్పష్టం చేశారు. తన రాజకీయ ప్రవేశంపై ప్రజల సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వాన్ని ఆయన కోరారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, లారెన్స్ అత్యంత ఆప్తమిత్రుడు అయిన నటుడు విజయ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ఆ తర్వాత ఖాళీ చేసిన 'తిరుచ్చి ఈస్ట్' నియోజకవర్గం ఉప ఎన్నిక నుంచి లారెన్స్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో లారెన్స్ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి విజయ్ గడిచిన ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ స్థానాల నుండి పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు. అయితే, నిబంధనల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి రావడంతో, సచివాలయానికి సమీపంలో ఉండే పెరంబూర్ స్థానాన్ని ఉంచుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. విజయ్ ఖాళీ చేసిన ఈ స్థానం నుంచే లారెన్స్ బరిలోకి దిగుతారనే వార్తలకు తాజా ప్రకటన మరింత బలాన్ని చేకూర్చింది.


Smacy News 1 hour ago
Home Flash News