Select Location
All Locations
State
Region
City / District
మేమంతా మీ వెంటే..విద్యార్థులకు సినీ, క్రీడా, సాహితీ ప్రముఖుల మద్దతు

మేమంతా మీ వెంటే..విద్యార్థులకు సినీ, క్రీడా, సాహితీ ప్రముఖుల మద్దతు

న్యూఢిల్లీ, జూలై 23 : నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు పలువురు సినీ ప్రముఖులు మద్దతు ప్రకటించారు. విద్యార్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం ట్వీట్‌ చేసిన అనంతరం వీరు స్పందించడం గమనార్హం. ఇలా స్పందించిన వారిలో నటీనటులు కమల్‌ హాసన్‌, సోనూ సూద్‌, దియా మీర్జా, అదితి రావు హైదరీ, ప్రకాశ్‌ రాజ్‌, నటి, నిర్మాత నందితా దాస్‌, సినీ రచయిత్రి సుతాప సిక్దార్‌, భూమి ఫడ్నేకర్‌, సోనాక్షి సిన్హా, కీడా ప్రముఖులు యువరాజ్‌ సింగ్‌, అభినవ్‌ బింద్రా, మనూబాకర్‌, నిఖత్‌ జరీన్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో, ఇన్‌స్టాలో, మీడియాతో వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు

విద్యార్థులకు లాఠీలెదురైతే ఆ దేశం విఫలమైనట్టే ‘ఒక పిల్లవాడు ఏడ్చినప్పుడు మనం తప్పక వినాలి. అయితే చాలామంది పిల్లలు చనిపోయేంత వరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. నేర్చుకోవడం స్థానంలో శిక్షణ, జిజ్ఞాస స్థానంలో నేర ప్రవృత్తి చోటుచేసుకునే వ్యవస్థ కుళ్లిపోయింది. సమాధానాలకు బదులుగా అడ్డంకులు, లాఠీలు ఎదురయ్యాయంటే ఆ దేశం విఫలమైనట్టే. విద్యార్థుల కోసం ఆమరణ దీక్ష చేస్తున్న సోనమ్‌ వాంగుచుక్‌ వెంటనే దీక్ష విరమించాలి.

ఓటమి పరవాలేదు.. మోసం చేయకూడదు.. ఓటమి పరవాలేదు. మోసం చేయకూడదు. విజయం కోసం అడ్డదారులు తొక్కవద్దని మా నాన్న చెప్పేవారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదని విద్యార్థులు నిరాశ చెందటం సహజం. మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురుకాకుండా మనందరం సమిష్ఠిగా కృషి చేయాలి. సమాజంలో పెద్దలుగా, మన సంస్కృతిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.


Smacy News 1 hour ago
Home Flash News