మున్సిపల్ ట్రైనింగ్కు రామగుండం కార్పొరేటర్లు డుమ్మా..
గోదావరిఖని, వెలుగు: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహించే శిక్షణా తరగతులకు రామగుండం మున్సిపల్ కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ఎన్నికల్లో గెలుపొందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేలా మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులకు గురువారం శిక్షణ ఇచ్చేలా అధికారులు ప్లాన్ చేశారు
రెండు బస్సులను ఏర్పాటుచేసి ఒక్కో బస్సుకు రూ.43 వేల చొప్పున కార్పొరేషన్ నుంచి ఆర్టీసీకి రూ.86 వేలు చెల్లించారు. ఉదయం 5 గంటలకు రెండు రాజధాని ఏసీ బస్సులు కార్పొరేషన్ ఆఫీస్ వద్దకు రాగా.. 60 మంది కార్పొరేటర్లకు గాను కేవలం సీపీఐ కార్పొరేటర్ మార్కపురి సూర్య, కాంగ్రెస్ కార్పొరేటర్లు మౌనిక, మానస, స్వప్నప్రియ, బాలసాని తిరుపతి, బీఆర్ఎస్ కార్పొరేటర్ మేకల సమ్మయ్య మాత్రమే చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్లో రిపోర్ట్ చేయాల్సి ఉండగా ఎవరూ రాలేదు. దీంతో ముగ్గురు మహిళా కార్పొరేటర్లు కూడా ఇండ్లకు వెళ్లిపోవడంతో మిగిలిన ముగ్గురు కూడా డ్రాప్ అయ్యారు. కార్పొరేషన్లో ఆఫీసర్లు కనీస ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని, ఈ విషయమై ఇటీవల కలెక్టర్‌కు కూడా వినతిపత్రం సమర్పించినట్లు కార్పొరేటర్లు సూర్య, మేకల సమ్మయ్య పేర్కొన్నారు.