బరిలోకి పుంజులను వదిలిన అంబటి, రోజా
గోరంట్ల, న్యూస్‌టుడే: గుంటూరు నగరంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి పోటీలు నిర్వహించారు. మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. మహిళల ముగ్గుల పోటీల్లో మొదటి విజేతకు రూ.లక్ష, రెండో విజేతకు రూ.50 వేల చొప్పున బహుమతులు అందించారు. అనంతరం కోడిపందేలు నిర్వహించగా.. రాంబాబు, రోజా కోడి పుంజులను బరిలోకి వదిలారు. తాను ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నానని, గతంలో సత్తెనపల్లిలోనూ ఈ పోటీలు జరిగినట్లు అంబటి రాంబాబు తెలిపారు. రాష్ట్రంలో రాంబాబు అంటే సంక్రాంతి.. సంక్రాంతి అంటే రాంబాబు అంటూ అంబటికి రోజా కితాబిచ్చారు.