Putin-Netanyahu: ఇరాన్‌లో ఉద్రిక్తతల వేళ.. పుతిన్-నెతన్యాహు ఫోన్ కాల్
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌లో కొనసాగుతోన్న ఉద్రిక్తతలపై రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Putin-Netanyahu) ఫోన్ కాల్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితులపై వారు చర్చించుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌తో మధ్యవర్తిత్వానికి అవసరమైతే తాము సాయం చేస్తామని నెతన్యాహుకు పుతిన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్‌లో శాంతి భద్రతలను తిరిగి నెలకొల్పడానికి కావాల్సిన దౌత్య ప్రయత్నాలు కూడా చేస్తామని హామీ ఇచ్చారు.