మహానగరంలో పులి మళ్లీ గర్జించలేదు...
ఇంటర్నెట్ డెస్క్ : ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు ముంబయి మహానగరం కీలకమైనది. దశాబ్దాల క్రితం ఇక్కడే బాల్‌ఠాక్రే సారథ్యంలో శివసేన ఆవిర్భవించింది. అనంతరం దేశ ఆర్థిక రాజధానిపై వారి హవానే కొనసాగింది. అయితే తాజా ఎన్నికల్లో ఉద్ధవ్‌కు ఆయన సోదరుడు రాజ్ అండగా నిలిచినా .. విజయం అందుకోలేక చతికిలపడింది. భాజపా-శివసేన కూటమి ఘనవిజయం సాధించింది.