Revanth Reddy: పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధి - ఎయిర్‌బస్ తిరిగేలా ఎయిర్ పోర్ట్ - నిర్మల్‌లో రేవంత్ కీలక ప్రకటన
CM Revanth Nirmal: "ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం.. ఇది పోరాటాల గడ్డ. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్‌లో జరిగిన ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించారు. జిల్లా అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు బాసర ఐఐటీ లోనే యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించి, నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.