5G market: 5G యూజర్లు @40 కోట్లు+.. టాప్-5లో ఈ దేశాలు
5G market | దిల్లీ: దేశంలో 5జీ నెట్‌వర్క్ వినియోగించే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన అనతికాలంలోనే దీన్ని వాడేవారి సంఖ్య 40 కోట్ల మార్కును దాటింది. దీంతో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచిందని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. 110 కోట్ల యూజర్లతో చైనా తొలి స్థానంలో నిలిచింది. ఈ విషయంలో 35 కోట్ల యూజర్లతో అమెరికా మూడో స్థానంలో, 20 కోట్ల మంది యూజర్లతో యూరోపియన్ యూనియన్, 19 కోట్ల మందితో జపాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.