Mega Victory Celebrations: మెగా విక్టరీ.. సెలబ్రేషన్స్
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. వెంకటేశ్ కీలకపాత్రలో నటించారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకుంది. దీంతో చిత్రబృందం తాజాగా సెలబ్రేషన్స్ చేసుకుంది. దర్శకనిర్మాతలతో పాటు చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్ ఆ సెలబ్రేషన్స్‌లో పాల్గొని కేక్ కట్ సందడి చేశారు.