ICC Player of Month: రెండేళ్ల తర్వాత ఆసీస్‌కు తొలిసారి.. RCB ప్లేయర్‌ను ఓడించి ఐసీసీ అవార్డు పట్టేసిన స్టార్క్
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. స్టార్క్ ను డిసెంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా గురువారం (జనవరి 15) ఐసీసీ ప్రకటించింది. స్టార్క్ తో పాటు నామినీలుగా ఉన్న వెస్టిండీస్‌కు చెందిన జస్టిన్ గ్రీవ్స్, జాకబ్ డఫీలకు నిరాశే మిగిలింది. ఇంగ్లాండ్ తో ఇటీవలే ముగిసిన యాషెస్ సిరీస్ లో ఈ ఆసీస్ బౌలర్ అత్యద్బుతంగా రాణించాడు. అడిలైడ్, మెల్ బోర్న్ టెస్టుల్లో బౌలింగ్ లో విజృంభించి 16 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు బ్యాటింగ్ లోనూ రాణించి బ్రిస్బేన్ టెస్టులో 77 పరుగులు.. అడిలైడ్ టెస్టులో 54 పరుగులు చేశాడు. ఈ సిరీస్ మొత్తం 31 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు.