ఇండియాలో వెయ్యి కోట్ల సైబర్ స్కాం : సంక్రాంతి రోజు బయటపడిన అతి పెద్ద మోసం
బెంగళూరులో వచ్చిన సైబర్ కంప్లెయింట్.. దేశ చరిత్రలోనే అతిపెద్ద డిజిటల్ స్కామ్‌లలో ఒకటిగా బయటపడింది. సుమారు వెయ్యి కోట్లకు పైగా ప్రజల సొమ్మును కొల్లగొట్టిన ఒక భారీ ముఠా గుట్టును బెంగళూరు హుళిమావు పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేయడమే కాక.. దాదాపు 4వేల 500 బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.240 కోట్లను ఫ్రీజ్ చేశారు.