T20 World Cup 2026: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ దూరం.. వరల్డ్ కప్‌కు డౌట్
స్వదేశంలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ దగ్గర పడుతున్న సమయంలో టీమిండియాకు గాయాల సమస్యలు కలవరపెడుతున్నాయి. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ గాయంతో వరల్డ్ కప్ ఆడతాడో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ లిస్ట్ లో మరో క్రికెటర్ చేరిపోయాడు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా వరల్డ్ ఆడడం అనుమానంగా మారింది. న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో గాయపడిన సుందర్.. ఈ క్రమంలో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. తాజాగా ఈ స్పిన్ ఆల్ రౌండర్ కోలుకునే అవకాశాలు కనిపించకపోవడంతో న్యూజిలాండ్ తో జరగనున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు దూరమయ్యాడు.