Allu Arjun: 'పుష్ప 3: ది రాంపేజ్' మొదలైంది.. హైదరాబాద్‌లో స్పెషల్ ఆఫీస్ తెరిచిన సుకుమార్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'పుష్ప' ఒక బ్రాండ్ మారిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మేకింగ్ కలిసి చేసిన ఈ ఫ్రాంజైజీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద 'పుష్ప2' కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 3 పైనే ఉంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం 'పుష్ప 3: ది రాంపేజ్' (Pushpa 3: The Rampage) పనులు అధికారికంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది