Sanitation worker Honesty: నిజాయితీకి లలితా జ్యువెలరీ యజమాని సలాం - 25 తులాల బంగారం అప్పగించిన కార్మికులకు ఘన సన్మానం
Sanitation worker Honesty: ఆమె ధనంలో నిరుపేదే కానీ గుణంలో ధనవంతురాలు. రోడ్డుపై పడి ఉన్న సుమారు 25 తులాల బంగారు ఆభరణాలను చూసి ఆశపడకుండా, వెంటనే వాటిని పోలీసులకు అప్పగించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న లలితా జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్, ఆ కార్మికురాలి నిజాయితీకి ముగ్ధులయ్యారు. వారిని స్వయంగా తన నివాసానికి ఆహ్వానించి, సముచిత రీతిలో గౌరవించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.