Select Location
All Locations
State
Region
City / District
వడ్ల కొనడంలో సర్కారు విఫలం : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

వడ్ల కొనడంలో సర్కారు విఫలం : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ, వెలుగు: వడ్లు కొనడంలో సర్కారు పూర్తిగా విఫలమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో ఆయన మాట్లాడుతూ కోతలు పూర్తైనా ఇప్పటి వరకు 25 శాతం వడ్లు మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. గన్నీ బ్యాగులు లేవని, లారీలు రావడం లేదన్నారు.

మిల్లులకు వెళ్లిన లారీలను అన్​లోడ్​ చేయకపోయినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వర్షాలు పడి వడ్లు తడిసి పోయి రైతులు ఇబ్బంది పడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. వడ్ల కొనుగోలు స్పీడప్​ చేయాలని డిమాండ్​ చేశారు.


V6 News 1 hour ago
Home Flash News