Select Location
All Locations
State
Region
City / District
విభజన హామీల అమలేది?..ప్రధాని మోదీకి సీపీఎం బహిరంగ లేఖ

విభజన హామీల అమలేది?..ప్రధాని మోదీకి సీపీఎం బహిరంగ లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ ప్రధాని నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాసింది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రధాని నిర్వహించనున్న బహిరంగ సభను పురస్కరించుకుని, రాష్ట్ర ప్రయోజనాలపై పది ప్రశ్నలను లేఖలో సంధించింది. ఈ మేరకు శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు.

కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, తెలంగాణ ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని సమస్యల పరిష్కారానికి ఈ సభ వేదిక కావాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్‌‌‌‌‌‌‌‌ సవరణ బిల్లుతో ఉచిత విద్యుత్తుకు ముప్పు తెస్తున్నారని, లేబర్‌‌‌‌‌‌‌‌ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను హరిస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసి కూలీల బతుకుదెరువును దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు


V6 News 1 hour ago
Home Flash News