Select Location
All Locations
State
Region
City / District
కురుమూర్తి టెంపుల్ను డెవలప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

కురుమూర్తి టెంపుల్ను డెవలప్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే: ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి

చిన్నచింతకుంట, వెలుగు: పేదల తిరుపతి కురుమూర్తి ఆలయాన్ని అభివృద్ధి చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచుకుళ్ల రాజేశ్​రెడ్డి అన్నారు. బుధవారం ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.110 కోట్లతో దేవాలయం అభివృద్ధి చేస్తున్నామని, ముఖ్యమంత్రి సహకారంతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంతో పోటీపడి కురుమూర్తి స్వామి ఆలయానికి నిధులు తీసుకొస్తామని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో అభివృద్ధి కార్యక్రమాలకు స్వచ్ఛందంగా భక్తులు ముందుకొస్తే వారికి సహకరిస్తామని, స్నేహ ఫౌండేషన్ నిర్వాహకులు ఆలయ మహా మండపం నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.

కురుమూర్తి స్వామి ఆలయంలో కాటేజీలు, కల్యాణ మండపం తోపాటు, పలు అభివృద్ధి పనులను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. నూతన పాలకమండలి భక్తులకు అందుబాటులో ఉండి పనిచేయాలని సూచించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ కథలప్ప, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎస్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


V6 News 1 hour ago
Home Flash News