Select Location
All Locations
State
Region
City / District
ఐరాస బ్లాక్‌లిస్ట్‌లోకి రష్యా, ఇజ్రాయెల్‌ దళాలు

ఐరాస బ్లాక్‌లిస్ట్‌లోకి రష్యా, ఇజ్రాయెల్‌ దళాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: సంక్షోభ ప్రదేశాల్లో లైంగిక హింసపై ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన వార్షిక నివేదిక వివాదాస్పదంగా మారింది. దీనిలో రష్యా, ఇజ్రాయెల్‌ దళాల పేర్లను కూడా చేర్చడంతో ఆ దేశాలు మండిపడ్డాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం మొదలైన ఈ నివేదికలో తొలిసారి ఇజ్రాయెల్‌ పేరును చేర్చారు. పాలస్తీనాలో ఆ దేశ దళాలు చేస్తున్న హింసకు ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌ బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో రష్యా దళాలను కూడా తొలిసారి ఈ జాబితాలో చేర్చారు. 

ఈ నిర్ణయంపై ఐరాసలోని రష్యా రాయబారి వెసెల్లీ నింబెంజియా తీవ్రంగా స్పందించారు. తమ దేశాన్ని విలన్‌గా చిత్రీకరించేలా నివేదికలో అసత్య ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్‌ రాయబారి డానీ డానన్‌ ఈ నివేదికపై మాట్లాడుతూ.. తమకు ఐరాస సెక్రటరీ జనరల్‌తో పనిలేదని అన్నారు. తమ దళాలను ఐసిస్‌, హమాస్‌ వంటి ముఠాల వలే చూపించారని మండిపడ్డారు. ఈ ఏడాది డిసెంబర్‌తో ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఆంటోనీ గుటెర్రస్‌ పదవీకాలం ముగియనుంది.


Eenadu Telugu 2 days ago
Home Flash News