Select Location
All Locations
State
Region
City / District
అప్పట్లో నెల జీతం రూ. 275.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.250 కోట్లు.. తలైవర్ పాత ఐడీ కార్డ్ వైరల్!

అప్పట్లో నెల జీతం రూ. 275.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.250 కోట్లు.. తలైవర్ పాత ఐడీ కార్డ్ వైరల్!

బ్లాక్‌బస్టర్ హిట్లు, స్టైలిష్‌గా గాల్లోకి ఎగరేసే సన్‌గ్లాసెస్, థియేటర్లలో మార్మోగే ఈలలు, గోలలు... వీటన్నింటికీ ముందు బెంగళూరు సిటీ బస్సులో టికెట్లు కొడుతూ ఒక సాధారణ యువకుడు కనిపించేవాడు. అతని పేరు శివాజీరావు గైక్వాడ్. ప్రస్తుతం ఆ పేరు చెబితే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు, కానీ రజనీకాంత్ , తలైవర్ అంటే ప్రపంచమే ఊగిపోతుంది. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ లెజెండ్ తొలి అడుగుల గురించిన ఒక క్రేజీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఇటీవల నెట్‌లో వైరల్ అవుతున్న బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్ (BTS) ఐడెంటిటీ కార్డ్ రజనీ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. 1971లో జారీ చేసిన ఈ పాత ఐడీ కార్డులో తలైవర్ తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ తో బస్ కండక్టర్‌గా కనిపిస్తున్నారు. అయితే, ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచిన అసలు విషయం ఏంటంటే... ఆ రోజుల్లో ఆయన నెల జీతం అక్షరాలా రూ. 275 మాత్రమే.. ఒకప్పుడు బెంగళూరులో రూట్ నంబర్ 10A బస్సులో టికెట్లు ఇస్తూ, నెలకు రూ. 275 సంపాదించిన ఆ యువకుడే.. 

భవిష్యత్తులో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సూపర్ స్టార్ అవుతాడని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఇవాళ ఆయన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పట్లో వందల్లో జీతం తీసుకున్న తలైవర్, ఇప్పుడు ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 200 కోట్ల నుండి రూ. 250 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. 'జైలర్', 'కూలీ' సినిమాలకు ఆయన తీసుకున్న పారితోషికం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధికం. రూ. 275 ఎక్కడ? రూ. 250 కోట్లు ఎక్కడ? ఇది కదా అసలైన 'రజనీజం' అంటే.. అని కొనియాడుతున్నారు.


V6 News 1 hour ago
Home Flash News