Select Location
All Locations
State
Region
City / District
BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ ఆఫర్: తక్కువ ధరకే రోజుకు 3GB డేటాతో 2 నెలలకు పైగా వ్యాలిడిటీ!

BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ ఆఫర్: తక్కువ ధరకే రోజుకు 3GB డేటాతో 2 నెలలకు పైగా వ్యాలిడిటీ!

ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సేవా సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్తగా రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్‌కు మించి ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. ఎక్కువ డేటా, ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారిని ఈ ప్లాన్లు విడుదల చేసినట్లు తెలుస్తుంది. BSNL సోషల్ మీడియాలో ఈ ప్లాన్ వివరాలు షేర్ చేస్తూ ప్రకటించింది.

రూ. 599 ప్లాన్ ప్రయోజనాలు BSNL కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 599 రీఛార్జ్ ప్లాన్ కస్టమర్లకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. 70 రోజుల వాలిడిటీ, ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటా అంటే 70 రోజుల పాటు మొత్తంగా 210 GB లభిస్తుంది. ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, ఉచిత నేషనల్ రోమింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ రూ.600 లోపు ధరతో 70 రోజులు అంటే 2 నెలల కంటే ఎక్కువ రోజుల పాటు డేటా, కాలింగ్ ఫెసిలిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ ధర ఎక్కువ అనిపిస్తే, సేవింగ్స్ లేదా రూ.100లోపు ప్లాన్‌ల కోసం చూస్తున్న కొత్త కస్టమర్ల కోసం కంపెనీ రూ. 51కే ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందిస్తోంది. 

ఈ ప్లాన్ వాలిడిటీ ఒక నెల పాటు ఉంటుంది. ఆన్ లిమిటెడ్ కాలింగ్‌, రోజుకు 2GB డేటాతో ఇందులో నేషనల్ రోమింగ్ కూడా ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ పెద్ద పెద్ద టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ, కస్టమర్లకు తక్కువ ధరలో నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలవాలని చూస్తోంది. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ, ఎక్కువ డేటా, మంచి సిగ్నల్ కవరేజ్ ఇస్తూ తెచ్చిన ఈ కొత్త రూ. 599 ప్లాన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రతి నెలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా, తక్కువ బడ్జెట్‌లోనే ఎక్కువ లాభం పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.


V6 News 1 hour ago
Home Flash News