Select Location
All Locations
State
Region
City / District
ఫైనల్కి ముందు గుజరాత్ టైటాన్స్కి షాక్.. ఆర్సీబీకి లక్కు కలిసొచ్చింది రోయ్

ఫైనల్కి ముందు గుజరాత్ టైటాన్స్కి షాక్.. ఆర్సీబీకి లక్కు కలిసొచ్చింది రోయ్

IPL 2026 Final: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ కి సర్వం సిద్ధమైన తరుణంలో గుజరాత్ టైటాన్స్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. కాసేపట్లో నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో టైటిల్ పోరు జరగాల్సి ఉంది. కానీ ఈ మహా సంగ్రామానికి ముందు టైటాన్స్ టీమ్ ప్రయాణంలో తీవ్ర అంతరాయం నెలకొంది. చండీగఢ్ నుంచి అహ్మదాబాద్ చేరుకోవాల్సిన శుభ్‌మన్ గిల్ సేన.. నార్త్ ఇండియాలో సంభవించిన తుఫాను, భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

న్యూ చండీగఢ్ వేదికగా మే 29న జరిగిన రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనలోకి ఎంట్రీ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ కోసం శనివారం (మే 30) మధ్యాహ్నమే గుజరాత్ అహ్మదాబాద్‌కు చేరుకోవాల్సి ఉంది. కానీ పంజాబ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతంపై ఇసుక తుఫాను, ఈదురు గాలులతో కూడిన వర్షంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో గిల్ సేన ప్రయాణం గంటల కొద్దీ ఆలస్యమైంది. గుజరాత్ టైటాన్స్ ప్రాక్టీస్ సెషన్ రద్దు: విమానం ఆలస్యం కావడంతో శనివారం అర్ధరాత్రి 11 గంటలు దాటిన తర్వాత గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు అహ్మదాబాద్‌లోని తమ హోటల్ రూమ్స్ కి చేరుకోలేకపోయారు. సాధారణంగా ఇలాంటి బిగ్ మ్యాచ్‌లకు ముందు ప్లేయర్స్ కి తగినంత రెస్ట్ చాలా అవసరం.. శనివారం రోజు గుజరాత్ జట్టు ఎలాంటి ప్రాక్టీస్ సెషన్స్ పెట్టుకోలేదు, ప్రయాణంలో జరిగిన ఆలస్యంతో ఆటగాళ్లు తీవ్రంగా అలిసిపోయారు. సరిగ్గా రెస్ట్ తీసుకునే టైమ్ కూడా వారికి దొరకలేదు. 

ఆర్సీబీకి ఫుల్ అడ్వాంటేజ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మాత్రం వాతావరణం ద్వారా ఫుల్ అడ్వాంటేజ్ దక్కింది. బెంగళూరు జట్టు మే 27వ తేదీనే అహ్మదాబాద్ కి వచ్చేసింది. దీంతో రాయల్స్ ఆటగాళ్లకు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటానికి, నరేంద్ర మోడీ స్టేడియంలో నెట్స్ లో తీవ్రంగా శ్రమించడానికి చాలా సమయం లభించింది. ప్రాక్టీస్‌తో పాటు వారు తగినంత రెస్ట్ తీసుకుని ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నారు. గుజరాత్‌తో పోలిస్తే ఆర్సీబీ కాస్త రిలాక్స్‌డ్‌గా బరిలోకి దిగబోతుంది. ఫైనల్ మ్యాచ్‌లో జీటీ ప్లేయర్స్ అలసట ఎఫెక్ట్: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ఈ అలసట ప్రభావం ఫైనల్ మ్యాచ్‌ ప్రదర్శనపై పడుతుందా లేదా అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇక టైటాన్స్‌కు ఒక పెద్ద ఊరట ఇచ్చే అంశం ఏంటంటే.. ఫైనల్ జరుగుతోంది వారి సొంత గ్రౌండ్ లోనే.. గత రెండు సీజన్ల నుంచి ఇక్కడి పిచ్, వాతావరణంపై ఆ జట్టుకు పూర్తి అవగాహన లభిస్తుంది. పైగా ఇదే ఐపీఎల్ 2026 సీజన్లో ఇక్కడి మోడీ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ బెంగళూరును ఘోరంగా ఓడించిన చరిత్ర ఉంది. ఈ హోమ్ అడ్వాంటేజ్, గత అనుభవం గిల్ సేనకు రిలీఫ్ ఇస్తుంది.


V6 News 1 hour ago
Home Flash News