Select Location
All Locations
State
Region
City / District
హొర్ముజ్‌పై దిగ్బంధం ఎత్తివేత!.. అమెరికా అధ్యక్షుడు సంకేతాలు

హొర్ముజ్‌పై దిగ్బంధం ఎత్తివేత!.. అమెరికా అధ్యక్షుడు సంకేతాలు

వాషింగ్టన్‌, మే 29: పశ్చిమాసియా సంక్షోభానికి తెరపడేలా, మరొక శాంతి ఒప్పందం కుదుర్చుకోడానికి అమెరికా-ఇరాన్‌ అడుగులు వేస్తున్నాయి. హొర్ముజ్‌ జలసంధిపై దిగ్బంధం ముగిసిందని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఇరాన్‌తో కుదరనున్న ఒప్పందంలో భాగంగా హొర్ముజ్‌ జలసంధిలో నావికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తామని ఆయన శుక్రవారం తెలిపారు. ఇరాన్‌తో చర్చల భవిష్యత్‌ను నిర్ణయించడానికి తాను వైట్‌హౌస్‌ సిట్యుయేషన్‌ రూమ్‌కు వెళ్తున్నట్టు ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌లో ప్రకటించారు. ఒప్పందానికి ప్రాతిపదికగా నిలిచే కీలక షరతుల గురించి ఆయన వివరించారు.

అణ్వాయుధం, అణు బాంబు ఎన్నడూ అభివృద్ధి చేయమని ఇరాన్‌ హామీఇవ్వాలి. హొర్ముజ్‌ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా, షరతులు విధించకుండా తెరవాలని అన్నారు. ఈ ప్రాంతంలో విధించిన నౌకా దిగ్బంధనాలు ఎత్తివేస్తామని, హొర్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకలు తమ గమ్య స్థానాలకు వెళ్లడం ప్రారంభించవచ్చునని అన్నారు. గత ఏడాది ఇరాన్‌ అణు కేంద్రాలపై జరిగిన దాడులలో లక్ష్యంగా చేసుకున్న ప్రదేశాల కింద పాతిపెట్టి ఉన్న శుద్ధి చేసిన అణు పదార్థాన్ని నాశనం చేయడానికి ముందు ఇరాన్‌, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సమన్వయంలో అమెరికా దానిని వెలికి తీస్తుందని ఆయన పేర్కొన్నారు.


Smacy News 1 day ago
Home Flash News