ఇండియా క్లీన్ స్వీప్..అఫ్గానిస్తాన్‌పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం
చెన్నై: బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ (86 బాల్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 110 నాటౌట్) సెంచరీకి తోడు రోహిత్ శర్మ (79) మెరవడంతో.. శనివారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలోనూ ఇండియా 9 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై గెలిచింది. దాంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్ స్వీప్ చేసింది. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ 44.2 ఓవర్లలో 218 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (102) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆరంభం నుంచే చెలరేగిన పేసర్ ప్రసిధ్ కృష్ణ (5/23) అఫ్గాన్ టాప్ ఆర్డర్‌ను పేకమేడలా కూల్చాడు.
రెహమనుల్లా గుర్బాజ్ (5), ఇబ్రహీం జద్రాన్ (11), రహమత్ షా (5), డార్విష్ రసూలీ (1)ని ఔట్ చేయడంతో 36/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో షాహిది ఒంటరి పోరాటం చేశాడు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (50)తో కలిసి ఐదో వికెట్‌కు 105, మహ్మద్ నబీ (21)తో కలిసి ఆరో వికెట్‌కు 57 రన్స్ జోడించాడు. కండరాలు పట్టేసినా పట్టుదలతో ఆడిన షాహిది.. 128 బాల్స్‌లో తన తొలి వన్డే సెంచరీ (102) పూర్తి చేసుకుని ప్రసిధ్‌కు వికెట్ ఇచ్చాడు. తర్వాత ఇండియా 28.4 ఓవర్లలో 224/1 స్కోరు చేసి నెగ్గింది.