Select Location
All Locations
State
Region
City / District
ఫన్నీ ట్రంప్.. జీ7 వేదికపై నేనే బాస్ అని ..సరదాగా అన్నానని వివరణ

ఫన్నీ ట్రంప్.. జీ7 వేదికపై నేనే బాస్ అని ..సరదాగా అన్నానని వివరణ

వాషింగ్టన్: జీ7 సమిట్ వేదికపై ‘తానే బాస్’ అంటూ సరదాగా వ్యాఖ్యానించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరణ ఇచ్చారు. ‘‘నేను కేవలం సరదాగా ఆ మాట అన్నాను. అంతేగానీ అక్కడ నేనే బాస్‌‌ని అనిపించుకోవాలని కాదు”అని చెప్పారు. బుధవారం ఫ్రాన్స్‌‌లో సమిట్ వేదికపై జీ7 దేశాల అధినేతలను ఉద్దేశించి.. ‘‘ఐ యామ్ ది బాస్”అని ట్రంప్ చేసిన వ్యాఖ్య వైరల్ కావడంతో పాటు అంతర్జాతీయంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వివరణనిచ్చారు.

‘ది ఆక్సియోస్ షో’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలను వేరేలా ప్రచారం చేశారని, అది కేవలం హాస్యం కోసమే అన్నానని చెప్పారు. ప్రపంచ దేశాల నేతలందరూ అప్పటికే కూర్చుని ఉన్న గదిలోకి నేను వెళ్లాను. లోపలికి వెళ్లగానే వారందరి వైపు చూసి 'నేనే బాస్' అన్నాను. అది కేవలం ఒక చమత్కారం మాత్రమే. కానీ ఈ చిన్న విషయం ప్రపంచమంతా పాకిపోయింది. నేను కేవలం నవ్వించడానికి ప్రయత్నించాను. అక్కడ బాస్‌‌లా హుకుం చలాయించడానికి కాదు” అని ఆయన వివరించారు. ‘‘నేనే బాస్ అన్న మాటను అక్కడ ఉన్నవారందరూ నమ్మారు(నవ్వుతూ..). కానీ నేను జోక్ చేశా’’ అని చమత్కరించారు.

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రశంసలు కురిపించారు. నెతన్యాహును ‘యోధ ప్రధాని(వారియర్ ప్రైమ్ మినిస్టర్)’ అని అభివర్ణించారు. లెబనాన్‌‌లో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడుల కారణంగా ఇరు దేశాల అధినేతల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వస్తున్న వార్తల నడుమ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఖతార్ బహుమతిగా ఇచ్చిన కొత్త ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానాన్ని శనివారం వాషింగ్టన్ సమీపంలో ఆవిష్కరించిన అనంతరం ట్రంప్ మాట్లాడారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ.. ఇరాన్‌‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్‌‌ ఎంతో సమర్థవంతంగా పోరాడాయని చెప్పారు.


V6 News 2 hours ago
Home Flash News