Select Location
All Locations
State
Region
City / District
‘కుడా’ ఆదాయంతో హనుమకొండలో బస్ టర్మినల్!

‘కుడా’ ఆదాయంతో హనుమకొండలో బస్ టర్మినల్!

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణాకేంద్రంగా ఉన్న హనుమకొండ బస్టాండ్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. నిత్యం 1500కుపైగా బస్సులు, లక్షలాది మంది రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురి కాగా.. తాజాగా హనుమకొండ బస్ టెర్మినల్ డెవలప్మెంట్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) ఇటీవల ప్లాట్లు వేలం నిర్వహిస్తుండగా.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో బస్ టెర్మినల్ పనులు చేపట్టేందుకు ప్లాన్ చేస్తోంది. దాదాపు రూ.వంద కోట్లతో పనులు చేపట్టి, కమర్షియల్ షాపుల ద్వారా ఆర్టీసీకి కూడా ఇన్ కం జనరేట్ అయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు తొందర్లోనే పనులు పట్టాలెక్కించేందుకు లీడర్లు, ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ కు హనుమకొండ బస్టాండ్ కీలకమైనది. ఇక్కడి నుంచి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు నడిపిస్తుండగా.. నిత్యం ఐదారు లక్షల మందికిపైగా రాకపోకలు సాగిస్తుంటారు. రవాణాపరంగా అంత ముఖ్యమైన ఈ బస్టాండ్ ను మొదట 1974లో అప్పటి అవసరాలకు అనుగుణంగా 9 ప్లాట్ ఫాంలతో నిర్మించారు. కానీ రవాణాపరంగా సేవలు విస్తరించే క్రమంలో పాత బస్టాండ్ పక్కనే 1990లో కొత్తగా సిటీ బస్టాండ్ ను 14 ప్లాట్ ఫాంలతో నిర్మించారు. ఆ తరువాత రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా, ఆ దిశగా డెవలప్ మెంట్ మాత్రం జరగడం లేదు. సరిపడా పార్కింగ్ సౌకర్యం కూడా లేకపోగా, వర్షాలు పడిన సమయంలో బస్టాండ్ ప్రాంగణమంతా చెరువులా మారి వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


V6 News 1 hour ago
Home Flash News